బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోన్న వైసీపీ ప్రభుత్వం
కర్నూలులో వచ్చేనెల 16, 17 తేదీల్లో బీసీ సామాజిక చైనత్య సదస్సు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
విజయవాడ : కావలి డీఎస్పీని సస్పెండ్ చేయాలని కోరుతూ ఏపీ బీజేపీ నేతలు
గవర్నర్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లా కావలిలో ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఎం జగన్‌కు వినతి పత్రం
ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకుడు మొగిరాల సురేష్‌ను పోలీసులు
అడ్డుకున్నారు. ఈ క్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ సురేష్‌ను తన రెండు కాళ్లతో
బంధించి నొక్కడం వైరల్ అయింది. డీఎస్పీ కర్కశంగా వ్యవహరించడంపై బీజేపీ
రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే డీజీపీ, జాతీయ బీసీ
కమిషన్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్ నజీర్‌ను కలిసి
ఫిర్యాదు చేశారు. కావలి పోలీసుల తీరును గవర్నర్‌కు వివరించిన నేతలు, వెంటనే
డీఎస్పీని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం
బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. బీసీలంటే సీఎం జగన్‌కు
ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. భాజపా నేత
సురేష్‌పై కావలి డీఎస్పీ దాడి చేయడం దారుణమన్నారు. సీఎంకు వినతి పత్రం
ఇచ్చేందుకు ముందుగానే పోలీసుల అనుమతి కోరినా వారి నుంచి స్పందన లేదన్నారు.
వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భాజపా నాయకులపై పోలీసులు దర్మార్గంగా
వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. కర్నూలులో వచ్చేనెల 16, 17 తేదీల్లో బీసీ
సామాజిక చైనత్య సదస్సు నిర్వహించాలని సంకల్పించామన్నారు.
టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయి : వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు
ఇస్తున్నామనే పేరుతో ప్రజలను దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము
వీర్రాజుమండిపడ్డారు. ఇసుక, గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డాగా వైసీపీ ప్రభుత్వం
వ్యవహారిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లో బీజేపీనీ బలోపేతం
చేస్తున్నామని టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ప్రకాశం
జిల్లాలో ప్రభుత్వం చేసిన అవినీతిపై ఛార్జ్‌షిట్ ఏర్పాటు చేశామన్నారు.