అమరావతి : ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు
ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ. రెండు వేల
కోట్ల రుణం తెచ్చింది. రూ. వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీ, మరో
వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.30 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. కాగా
ఇప్పటికే ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎం లో జగన్ ప్రభుత్వం రూ. 13 వేల 500 కోట్లు అప్పు
చేసింది. ఇంకా మిగిలింది రూ. 17 వేల 500 కోట్లే. ఈ లోపు ఆర్ధికలోటు కింద ఏపీ
ప్రభుత్వానికి కేంద్రం రూ. 10 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
2014-2019 వరకూ టీడీపీ ప్రభుత్వం ఆర్ధికలోటు విడుదల చేయాలన్నా అవసరం లేదని
కేంద్రం పిడివాదన వినిపించింది. తాజాగా రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల
చేయడంతో అప్పుడు మాట్లాడిన బీజేపీ నేతలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.