సినీ ఇండస్ట్రీలో అందాలతో మెప్పించిన అందాల తార అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’ తో వెండితెర పైకి రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘కాలీ పిలీ’ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ‘లైగర్’ లోను హీరోయిన్గా కనిపించింది. తాజాగా అనన్యకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
అనన్య పాండే బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమయాణాన్ని కొనసాగిస్తుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. అయితే, కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్-7’ లో అనన్య పాండే పాల్గొంది. ఆదిత్య రాయ్ కపూర్ హాట్‌గా ఉంటాడని పేర్కొంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో కొనసాగతుందని అందరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ జంట రిలేషన్షిప్లో ఉన్నారని వదంతులు హల్చల్ చేయడం ప్రారంభమయ్యాయి. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా దీపావళి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ అనంతరం ఆదిత్య, అనన్య జంటగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
నవ్వుతూ కనిపించారు. దీంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. కృతి సనన్ ఇచ్చిన పార్టీలోను వీరు జంటగా కనిపించారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అనన్య కెరీర్ విషయానికి వస్తే.. ‘డ్రీమ్ గర్ల్-2’ లో నటించనుంది. ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా కనిపించనుంది. ‘కో గయే హమ్ కహా’ అనే ప్రాజెక్టు కూడా ఆమె చేతిలో ఉంది. ఆదిత్య రాయ్ కపూర్ చివరగా ‘రాష్ట్ర కవచ్ ఓం’ లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది.