వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోమవారం
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో కార్మికశాఖ పరిధిలోని అన్ని
విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి జయరాం
మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మిక శాఖలోని అన్ని విభాగాలు
సమర్ధవంతంగా,చిత్తశుద్ధితో పని చేసి ప్రజలకు ముఖ్యంగా కార్మికులకు మెరుగైన
రీతిలో సేవలందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కార్మిక చట్టాలను
పటిష్టంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని మంత్రి జయరాం అధికారులను
ఆదేశించారు. ఇంకా ఈసమావేశంలో కార్మిక శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి
జయరాం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి
డా”హరి జవహర్ లాల్,కార్మిక శాఖ కమిషనర్ శేషగిరిరావు, ఈఎస్ఐ డైరెక్టర్
వి.ఆంజనేయలు,ఫ్యాక్టరీ శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ, బాయిలర్ల డైరెక్టర్ ఉమా
మహేశ్వరరావు,లేబర్ వెల్ఫేర్ కమిషనర్ రాణి, సంబంధింత అధికారులు పాల్గొన్నారు.