ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబును ఎప్పుడూ
నమ్మమని రైతులు అంటున్నారని పేర్కొన్నారు. తోకలు కత్తిరిస్తానంటూ బీసీలను
చంద్రబాబు అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు
మాట్లాడుతున్నారని, బీసీల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు.
మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అని
ప్రశ్నించారు.
దుర్మార్గుడు చంద్రబాబు : చంద్రబాబు బతుకంతా మోసమేనని మంత్రి కారుమూరి
ధ్వజమెత్తారు. ఆయన ఏనాడైనా పేదవాడికి ఒక సెంటు భూమి ఇచ్చారా అని నిలదీశారు.
అన్ని వర్గాల ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటేసే
యంత్రాలుగా బీసీలను వాడుకుంటున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్కు భారతరత్న
రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. యువగళంలో యువత
లేరు. రైతుల యాత్రలో రైతులు లేరని సెటైర్లు వేశారు. వర్ల రామయ్యకు ఎంపీ పదవి
అని చెప్పి ఎలా మోసం చేశాడో అందరికీ తెలుసని అన్నారు. ‘పేదలకు ఇళ్ల స్థలాలు
ఇస్తుంటే సమాధులు కట్టుకోమని అంటున్నారంటే ఇక చంద్రబాబుని ఏమనాలి?. చంద్రబాబు
అంతటి నీచుడు, నయవంచకుడు మరెవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు కూడా
రావు. ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది
చంద్రబాబు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును బాబు ఎలా తలుచకుంటారు. చంద్రబాబు ఓ గుంట
నక్కఅని మండిపడ్డారు.