మచిలీపట్నం : బందరుకు ఇంత వైభవం తీసుకొచ్చిన సీఎంకి వందనాలు, సీఎంబందరు
ఎప్పుడు వస్తారా అని నాలుగేళ్ళుగా ఎదురుచూశాం, పాదయాత్రలో చెప్పినట్లు మీ
పోర్టు పనులు మొదలయ్యేటప్పుడే వస్తానన్నారు. ఈ రోజు వచ్చారు, మునులు యజ్ఞం
చేసే సమయంలో భగ్నం చేయడానికి రాక్షసులు ఎలా అడ్డంకులు సృష్టించేవారో అలాగే
చంద్రబాబు, ఆయన తాబేదార్లు బందరు పోర్టు అడుగుముందుకు పడకుండా కోర్టుల్లో
దావాలు వేశారు. నక్కజిత్తుల చంద్రబాబుకు ఎక్కడ బలం ఉందో తెలుసు కదా,
నాలుగేళ్ళు ఏం చేశారని కొందరు మాట్లాడుతున్నారు. కానీ మీరు పెట్టిన
చిక్కుముడులు విడదీసి బందరు వాసుల కల అయిన పోర్టు నిర్మాణ పనుల
ప్రారంభోత్సవానికి సీఎం వచ్చారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల
ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య
(నాని) మాట్లాడుతూ ఇప్పుడు బందరు పోర్టు గుర్తుకొచ్చిందా అని ఒక పేపర్లో
రాశారు. ఈ ప్రారంభోత్సవంతో టీడీపీ నాయకులు ఈనో ప్యాకెట్లు తాగుతూ కడుపుమంట
చల్లార్చుకుంటున్నారు. జగన్ చంద్రబాబు ఇళ్ళ స్ధలాలు ఇచ్చారా అని అడిగారు.
పదివేలపైనే ఉంటారన్నాను. నేను సీఎం అవగానే ఎంతమంది ఉంటే అంతమందికి స్ధలాలు
ఇస్తానన్నారు. బందరు నియోజకవర్గంలో సుమారుగా 450 ఎకరాల భూమిని కొనుగోలు చేసి
25,090 పట్టాలు పేదలకు ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే
నిర్మాణం చేయబోతున్నారు, కరగ్రహారం అనే గ్రామంలో 326 ఎకరాల సింగిల్
లేఅవుట్లో 15,751 ఇళ్ళు వస్తున్నాయి, రైతులు చిరునవ్వుతో భూములు, పొలాలు
ఇచ్చి సంతోషంగా ఉన్నారు. మనిషికి, భూమికి విడదీయరాని బంధం ఉంటుంది, 31 లక్షల
మంది పేదలకు ఇళ్ళ స్ధలాలు ఎవరిచ్చారు, గిలకలదిండి అనే మత్స్యకార గ్రామంలో
ఇంతవరకు నిరుపేదలకు పట్టా ఇవ్వలేదు, కానీ మీరు 1,050 మందికి పట్టాలు ఇచ్చారు,
ఆ ఊరి చరిత్రలో మొదటిసారి, బందరుకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మనం ఆయనకు
గుండెల్లో స్ధానం ఇవ్వాలి, మనం ఊహించామా మెడికల్ కాలేజ్ వస్తుందని. ఇదంతా
నాకే కలగా ఉంది. నా పదవీకాలం ఉండగానే పూర్తవుతుంది. రూ. 550 కోట్లతో సుమారుగా
64 ఎకరాలలో మెడికల్ కాలేజ్ పూర్తికావొస్తుంది. గోల్డ్ కవరింగ్ పరిశ్రమల
వారు పాదయాత్రలో జగన్‌ని కలిసి కరెంట్ బిల్లుల గురించి మాట్లాడి తమ సమస్య
చెప్పారు. సీఎం అవగానే కరెంట్ చార్జీలు తగ్గించి వారిని ఆదుకున్నారు. ఆయన
చెప్పారంటే చేస్తారంతే. అలాగే గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు నీటిని ఇచ్చారు,
బందరు వైభవాన్ని తీసుకురావడం కోసం మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా అవడంతో
ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి, మచిలీపట్నానికి మరో
ఎమ్మార్వో ఆఫీస్‌ను కూడా మంజూరు చేశారు. మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న రైల్వే
లైన్ మీద ఆర్వోబీని మంజూరు చేయాలని కోరుతున్నా, అంబేద్కర్ విగ్రహాన్ని రూ. 5
కోట్లతో పునరుద్దరించాలని కోరుతున్నాను, తీరప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పేదలకు
తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు లేవు. చంద్రబాబు ఆ భూములన్నీ ప్రభుత్వ
భూములుగా రికార్డులు మార్చడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆ భూములు
అనుభవిస్తూ అర్హత గల పేదవారికి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నానన్నారు.