న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అంతరాలను బహిర్గతం చేసిన
కొవిడ్-19. వాటిని అధిగమించేందుకు మనం చేయాల్సిన సమష్టి కృషిని గుర్తు
చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో
జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా
ప్రధాని మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సమానత్వ ప్రాధాన్యాన్ని కూడా ఈ మహమ్మారి
మనకు గుర్తు చేసిందన్నారు. అంతర్జాతీయ సహకారానికి భారత్ ఎప్పుడూ కట్టుబడి
ఉందని, కొవిడ్ కష్టకాలంలో ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు 30 కోట్ల
వ్యాక్సిన్ డోసులను తాము సరఫరా చేశామన్నారు. ‘‘ఇందులో చాలావరకు గ్లోబల్
సౌత్ దేశాలు. రాబోయే రోజుల్లో అన్ని దేశాలకు వనరుల పరంగా సమాన అవకాశాలు
అందేలా చూసేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని ప్రధాని
కోరారు. భారతదేశ వైవిధ్యత ఇతరులకు ఓ మార్గదర్శి లాంటిదని.. అల్ప, మధ్య ఆదాయ
దేశాల్లో డబ్ల్యూహెచ్వో చేపట్టే ఇటువంటి కార్యక్రమాలకు తాము అండగా
ఉంటామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్,
ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపునకు విస్తృత కృషి, లక్షలాది కుటుంబాలకు
పారిశుద్ధ్యం, తాగునీరు చేరువ చేయడం వంటి భారత ప్రభుత్వ కార్యక్రమాల అంతిమ
లక్ష్యం ఆరోగ్య స్పృహను పెంచడమే అన్నారు. డబ్ల్యూహెచ్వో మొదటి సంప్రదాయ ఔషధాల
గ్లోబల్ సెంటర్ను భారత్లో ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని,
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ద్వారా చిరుధాన్యాల ప్రాశస్త్యాన్ని ప్రపంచం
గుర్తించడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు.