ఇస్లామాబాద్ : ప్రధాని పదవిని కోల్పోయిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్ తరచూ
అమెరికా ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారింది. కానీ, ఇప్పుడు తనను
ప్రభుత్వం జైల్లో పెడుతుందేమోనన్న భయంతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలినే
ఇమ్రాన్ సాయం అడిగారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్‌గా
మారిందని పాక్‌లో జియోటీవీ కథనం ప్రసారం చేసింది. అమెరికాలో ప్రతినిధుల సభలో
కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్సినె మూర్ వాటర్స్‌తో ఇమ్రాన్
టెలిఫోన్లో చర్చించారు. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికాలోని
చట్టసభలో గళం విప్పాలని ఆమెను కోరారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌లోని పరిస్థితిని
ఆమెకు వివరించినట్లు ఈ క్లిప్‌లో ఉంది. దీంతోపాటు తనకు అనుకూలంగా ఓ ప్రకటన
కూడా విడుదల చేయాలని మాక్సినె మూర్‌ను ఆయన కోరారు.