మచిలీపట్నం : భావితరాలకు మెరుగైన జీవితాలను అందించడానికి ప్రతి ఒక్కరూ
పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మిషన్ లైఫ్ 2023 కార్యక్రమంలో భాగంగా మంగినపూడి
సముద్ర తీరం వద్ద ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో
నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై
అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ మిషన్
లైఫ్ 2023 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో అన్ని
మండలాల్లో మిషన్ లైఫ్ పేరిట 75 పర్యావరణ విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు
నిర్వహిస్తున్నామన్నారు. వాటిలో ముఖ్యంగా ఏడు విభాగాలైన నీటి పొదుపు, విద్యుత్
పొదుపు, వ్యర్ధాలు తగ్గింపు, ఈ-వ్యర్థాల తగ్గింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్
నిషేధం, సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్, హెల్తీ లైఫ్ స్టైల్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ
పెట్టినట్లు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని
వివరిస్తూ ఆహారం దొరక్క పశువులు నిత్యం ప్లాస్టిక్ ని ఆహారంగా తీసుకుని
అనారోగ్యం పాలవుతున్నాయని ఇది ఎంతో బాధాకరమన్నారు. ఒకసారి వాడి పారేసిన
ప్లాస్టిక్ భూమిలో కలవడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని, దీనిని దృష్టిలో
పెట్టుకుని ప్లాస్టిక్ నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటించాలని ప్రజలకు
పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ అలవాట్లు ఎంతో అవసరం అన్నారు. ఇక
నుంచి ప్రతివారం సముద్ర తీర ప్రాంతంలో చెత్తను శుబ్రపరుచుకునేలా ప్రణాళికలు
రూపొందించి పక్కా చెత్తకుండీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పర్యావరణ భద్రత మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. అనంతరం బెల్, ఉయ్యూరు షుగర్
ఫ్యాక్టరీ, సంధ్య ఆక్వా, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్లాస్టిక్
వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి
ఎం.వెంకటేశ్వర్లు, బందరు డివిజన్ రెవెన్యూ అధికారి ఐ.కిషోర్, ఆంధ్రప్రదేశ్
కాలుష్య నియంత్రణ బోర్డు పర్యావరణ ఇంజనీరు టి. ప్రసాద రావు, జిల్లా అటవీ శాఖ
అధికారి రాజశేఖర రావు, సహాయ పర్యావరణ ఇంజనీరు కే.జ్యోత్స్న శ్రీ, భద్రత,
బాధ్యత ఫౌండేషన్ నిర్వాహకులు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.