అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు
ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. తన
తల్లి అనారోగ్యం దృష్ట్యా సోమవారం విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్ఛార్జ్ అయిన
తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు (ఈనెల 16,
19న) సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. అయితే, అవినాష్ లేఖపై
సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్
సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ వాట్సప్‌లో సీబీఐ నోటీసు పంపింది.
శుక్రవారమే సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది.
జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన
అవినాష్‌రెడ్డి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం వచ్చిందంటూ
మార్గమధ్యలోనే రూటు మార్చుకుని వెళ్లారు. ఆయన న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి
వెళ్లి ఈ సమాచారం అందించారు. అవినాష్‌రెడ్డి తల్లిని పులివెందుల నుంచి
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకురావడంతో శుక్రవారం నుంచి ఆయన అక్కడే
ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి
నోటీసిచ్చింది. దర్యాప్తు తుదిదశలో ఉన్నందున అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసే
అవకాశముందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం
నాటి విచారణకు హాజరు కాలేనని లేఖ రాయడం, దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందనేది
ఉత్కంఠగా మారింది.