గుంటూరు : గుంటూరులో భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా
జరిగింది. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర
విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృధ్ధిలోకి తీసుకెళ్లారని
కొనియాడారు. దేశంలో బీజేపీని ఎదుర్కోగల వ్యక్తి కేసీఆర్ మాత్రమేనన్నారు. ఏపీ
ప్రజలు టీడీపీ , వైసీపీ పాలనతో విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీలు
కక్షలు, కార్పణ్యాలతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజలు
సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వైసీపీ , టీడీపీలకు మోడీని ప్రశ్నించే
దమ్ములేదన్నారు. ఇక్కడి పార్టీలు మోడీకి గులాంగిరీ చేస్తున్నాయన్నారు. దక్షిణ
భారత దేశంలో ప్రధాని కాగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు.