టీ20 ప్రపంచకప్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో విజయంతో గ్రూప్-బిని విజయవంతంగా ముగించిన జింబాబ్వే సూపర్-12లోకి అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే రెండో దశకు చేరడం ప్రపంచకప్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. దీంతో జింబాబ్వే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం 133 పరుగులు స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్వైన్ 54 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సికిందర్ రజా 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.