కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో ఈ నెల 24న ముఖ్యమంత్రి పర్యటనను అందరూ
కలిసికట్టుగా విజయవంతం చేయాలని రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. ఈ మేరకు ఆదివారం హోంమంత్రి క్యాంపు
కార్యాలయం నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన
కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ప్రారంభిస్తారని తెలిపారు. సత్యవతి నగర్ లో క్యాంప్ ఆఫీస్ ఎదురుగా వున్న
స్థలంలో సభ నిర్వహిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు,
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా
అందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని ఆ ప్రకటనలో హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.