బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఐదు ఉచిత
హామీల అమలుకు సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే సూత్రప్రాయంగా
ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ. 50,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఐదు ఉచిత హామీల అమలుకు
సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే సూత్రప్రాయంగా ఆమోదం
తెలిపింది. వాటి అమలుకు ఏటా రూ.50,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
శనివారం ఉదయం కొత్త సీఎంగా సిద్ధరామయ్య, ఏకైక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎనిమిది మంది మంత్రులతో తొలి కేబినెట్ సమావేశం
జరిగింది. ఆ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సిద్ధూ ప్రభుత్వం.
అనంతరం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు.
“మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై
చర్చించి, ఆదేశాలు ఇచ్చాం. వారం రోజుల్లో మరో కేబినెట్ సమావేశం నిర్వహించి
వాటికి ఆమోదం తెలుపుతాం. ఆర్థికపరమైన చిక్కులు వచ్చినప్పటికీ కన్నడ ప్రజలకు
ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మా ప్రభుత్వం సంవత్సరానికి రూ.50,000 కోట్లు..
ఐదు హామీల కోసం ఖర్చు చేయడం అసాధ్యమని నేను అనుకోను. అప్పుల ఊబిలో
కూరుకుపోకుండా అన్ని పథకాలను అమలు చేస్తామన్న విశ్వాసం మాకు ఉంది. రాష్ట్ర
రుణానికి వడ్డీగా రూ.56,000 కోట్లు చెల్లిస్తున్నప్పుడు.. మన ప్రజల కోసం
రూ.50,000 కోట్లు ఖర్చు చేయలేమా?” అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. జులైలో
రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడతామని సిద్ధరామయ్య తెలిపారు.
bloomtimes.org/images/asha%20priya%202023/MAY%2021/RAHUL.jpg