నరసన్నపేట : వాలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేస్తున్న సంక్షేమ సారధులని
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. నరసన్నపేట మడలపరిషత్
కార్యాలయంలో శనివారం జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా
పాల్గొన్నారు. 264 మందికి సేవ మిత్ర, ఐదురికి సేవా రత్న, ఒకరికి సేవా వజ్ర
అవార్డులను ఈ సందర్భంగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ
వాలంటీర్ల సేవాభావం వల్ల కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే
ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో
జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని, కానీ ఇప్పుడు మాత్రం పింఛన్తో
రేషన్ డోర్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు అదేలా వాలంటీర్ల
సేవలు చేస్తున్నారన్నారు.
వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను వాలంటీర్లు
అందిస్తున్నారన్నారు. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని..
డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు సీఎం జగన్ అందించడంలో
వారి పాత్ర మరువలేనిది అన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వంపై నిందలు వేస్తే
నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు వాలంటీర్లే అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న
ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేస్తున్నారని మంచి చేశాం కాబట్టే గడపగడపకు
వెళ్లగలుగుతున్నామన్నారు. పేదల ప్రభుత్వంపై గిట్టని వారు తప్పుడు ప్రచారాలు,
అబద్ధాలు చెప్తున్నారని, నిందలు వేస్తున్నారన్నారు. ఇక్కడ పనిచేస్తున్న
వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు
పెట్టి అడుగులు వేస్తున్న మంచి మనుషులని పొగడ్తలు కురిపించారు. ఎవరైనా, ఏదైనా
అంటే గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే
చంద్రబాబుకు కడుపుమంట అన్నారు. చంద్రబాబు ఆపాదించిన దురుద్దేశాలు బాగా గుర్తు
పెట్టుకోవాలని, చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి తిరిగి జన్మభూమి
కమిటీలను తెస్తానన్నారని, కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా వాలంటీర్లు ప్రజలకు చూపించాలన్నారు.
ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో
డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళీధర్, మాజీ జెడ్పిటిసి
చింతు రామారావు, పంగ బావాజీ నాయుడు, రాజాపు అప్పన్న, చీపురు కృష్ణమూర్తి,
కోరాడ చంద్రభూషణ్ గుప్తా, సర్పంచ్ బురెల్లి శంకర్ పా