91 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనే కృతనిశ్చయంతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 91 వ
వార్డు సచివాలయ పరిధిలో శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు.
అధికారులు, నాయకులతో కలిసి బారిష్టర్ వారి వీధి, బోయపాటి వారి వీధి, బంకపాటి
వారి వీధి, శ్రీనివాసరావు వీధులలో విస్తృతంగా పర్యటించారు. 171 గడపలను
సందర్శించి ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని వివరించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని
మల్లాది విష్ణు అన్నారు. దారిద్ర్య నిర్మూలనకు నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిఒక్కరూ హర్షిస్తున్నారని చెప్పారు. గత
ప్రభుత్వంతో పోలిస్తే.. ఈ ప్రభుత్వంలో తమకు 100 శాతం మేలు చేకూరిందని ప్రజలు
చెప్పడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్
స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న
నేపథ్యంలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఉండేలా హెల్త్ సెక్రటరీ చొరవ
చూపాలని ఆదేశించారు. అలాగే శ్రీనివాసరావు వీధిలో నూతన రహదారి నిర్మాణానికి
ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు. అనంతరం మీడియాతో
మాట్లాడారు.
చంద్రబాబుది పక్కచూపు
పేదలు, మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ ప్రభుత్వం వైఎస్సార్
కాంగ్రెస్ ప్రభుత్వమని మల్లాది విష్ణు అన్నారు. హౌస్ ఫర్ ఆల్ నినాదంతో
రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలాలు
పంపిణీ చేస్తే దాని గూర్చి కూడా టీడీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటని
మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇల్లు సమాధికి కూడా సరిపోదని చంద్రబాబు దిగజారి
మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రి
అని చెప్పుకునే చంద్రబాబు పేద వర్గాలకు ఒక్క గజమైనా జాగా ఇచ్చారా..? అని
ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఒక్క సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి
సీఆర్డీఏ పరిధిలో 5,642 మందికి ముఖ్యమంత్రి చేతులమీదుగా ఇళ్ల పట్టాలు
అందజేయనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. మరో 1,569 మందికి సర్వే అనంతరం
పట్టాలు అందజేస్తామని తెలియజేశారు. అలాగే నున్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు
శరవేగంగా జరుగుతుండగా మరో 2, 3 నెలల్లో గృహ ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు.
సీఎం జగన్ ముందుచూపుతోనే ఇదంతా సాధ్యపడిందని మల్లాది విష్ణు అన్నారు. కానీ
ప్రతిపక్ష నేతది పక్కచూపని ఎద్దేవా చేశారు. సింగపూర్, మలేషియా గురించి తప్ప
ఏనాడూ ఆంధ్ర రాష్ట్రం గూర్చి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు గత
అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు 23 సీట్లకి పరిమితం చేశారని, ఈసారి టీడీపీకి
శాశ్వతంగా సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో
డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు కుక్కల రమేష్, కొమ్ము చంటి,
బెల్లపు సత్యనారాయణ, ఒబ్బిరెడ్డి రామిరెడ్డి, మనోహర్, బెల్లపు వెంకట్రావు,
చింతకాయల రామచంద్రారావు, మోహన్ రావు, భాను, నాయుడు, అన్ని శాఖల అధికారులు,
సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.