విజయవాడ : పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఈ-వేస్ట్ ను
సేకరించడం అభినందనీయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బస్టాప్
వద్ద వీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ ఆర్ ఆర్ (రెడ్యూస్ – రీయూజ్ –
రీసైకిల్) సెంటర్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగం నానాటికి
పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పాత వస్తువుల రీసైక్లింగ్ పై ప్రత్యేక దృష్టి
సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్లాది విష్ణు అన్నారు. అవసరం తీరిపోయిన,
నిరుపయోగంగా పడిఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ వేస్ట్, పాత పుస్తకాలు, వస్త్రాల
సేకరణకు ఆర్ ఆర్ ఆర్ సెంటర్లను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. వేస్ట్ మేనేజ్
మెంట్ యూనిట్ల ఏర్పాటు చేయడం ద్వారా పరిసరాలను కలుషితం కాకుండా
కాపాడుకోవచ్చన్నారు. సర్కిల్ – 2 పరిధిలో అటువంటి సెంటర్లు 21
ప్రారంభించుకుంటున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్యానికి సంబంధించి విజయవాడ
మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందుకోవడం
జరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో రానున్న
రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా వీఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు
చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల
అనిత రమేష్, జోనల్ కమిషనర్ సృజనా, ఏఎంఓహెచ్ రామ కోటేశ్వరరావు, వీఎంసీ సిబ్బంది
పాల్గొన్నారు.