విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి లో భాగంగా గురువారం మాజీ
మంత్రి, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు 39వ డివిజన్
పరిధిలో నగరపాలక సంస్థ, వివిధ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి డివిజన్
పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను
అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్ నిర్మాణం, తదితర
అభివృద్ధి పనులను త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలకు వాడుకలోకి తేవలసిందిగా
అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , స్థానిక
కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు
పాల్గొన్నారు.