చైనాకు చెందిన ఓ మహిళ పేరు మార్చుకుని నకిలి గుర్తింపు కార్డులతో బౌద్ధ సన్యాసిని వేషంలో ఉన్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన ‘కై రువో’ అనే మహిళ బౌద్ధ సన్యాసిని ముసుగులో ఢిల్లీలో తిష్ట వేసినట్లుగా గుర్తించారు. ఆమె పేరును ’డాల్మా లామా’మార్చుకుని ఢిల్లీలో నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఉత్తర ఢిల్లీలోని డిటెటన్ శరణార్ధుల కాలనీ అయిన మజ్నుకా తిలాలో బౌద్ధ సన్యాసిని వేషధారణలో ఉన్న ఆమెను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి డోల్మా లామా పేరుతో నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్స్ రీజినల్ రిజస్ట్రేషన్ కార్యాలయంలో ఆమెను విచారించిన సమయంలో సదరు మహిళ చైనా పౌరురాలిగా నిర్ధారణ అయ్యింది. ఆమె 2019లో భారత్ కు వచ్చినట్లుగా తేలింది.
తప్పుడు గుర్తింపుతో భారత్లో ఉండి “దేశ వ్యతిరేక కార్యకలాపాలకు” రుయో “దేశ వ్యతిరేక కార్యకలాపాలలో” పాల్గొంటోందని, ప్రస్తుతం నేపాల్ పౌరురాలిగాగా భారతదేశంలో నివసిస్తున్నారనే సమాచారం ఆధారంగా, ఆమెను మజ్ను కా తిలా నుండి అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు ప్రకటన తెలిపింది. అక్టోబర్ 17న ఆమెపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మూలం: ట్రిబ్యూన్