కావట్లేదు
ఎన్నో అసంబద్ధతలతో ఉన్న ఈ జీవో పై అనేక కోర్టు కేసులున్నప్పటికీ అదే జీవోను
కొనసాగిస్తూ బదిలీల ఉత్తర్వులు ఇస్తామనటం భావ్యం కాదు
నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్
విజయవాడ : బుధవారం జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలో ఆశించిన స్థాయిలో
విద్యారంగ సమస్యలు పరిష్కారం కాలేదని భావిస్తున్నట్లు,విద్యా శాఖా మాత్యులు
ఎన్నో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ విద్యారంగానికి
సంబంధించినటువంటి అసలైన సమస్యలు పై దృష్టి సాధించకపోవడం బాధాకరమని బదిలీలు
జరుపుతామని చెప్తూనే 117 జీవో కి అనుగుణంగా పని సర్దుబాటు చేసేలా ఉత్తర్వులు
ఇస్తామనటం విద్యా రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని నవ్యాంధ్ర టీచర్స్
అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాస
రావులు ప్రకటన పేర్కొన్నారు. మూడు నాలుగు, ఐదు, తరగతులను ఉన్నత పాఠశాలలో
మెర్జ్ చేసి ప్లస్- 2 పాఠశాలలో 1752 పోస్టులు కొత్తగా ఏర్పాటు చేసి 676 పైన
ఎంఈఓ-2 పోస్టులను కొత్తగా ఏర్పాటు చేయడం తప్ప ఈ చర్చల్లో ఆశించిన ఫలితాలు
అయితే అధికారుల నుంచి రాలేదన్నారు , రెండు దశాబ్దాలుగా శాశ్వత పదోన్నతుల ఛానల్
పై ఉన్న సందిగ్ధత అలాగే కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు
గడిపేసిందని ఈ ప్రభుత్వం హయాంలో పదోన్నతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా
కనిపించడం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రికగ్నైజ్డ్ సంఘాలు 117
జీవో ని ఎందుకు సమర్థిస్తున్నాయో అర్థం కావట్లేదు అని కనీసం వ్యతిరేకతను కూడా
తెలియజేయకుండా హర్షం వ్యక్తం చేయటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రాథమికోన్నత
పాఠశాలలో 98 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే ఎస్జీటీలతో బోధించడం, కొన్ని
పాఠశాలలో సంఖ్య తక్కువగా ఉంటే ప్రధానోపాధ్యాయ పోస్టును తొలగిస్తామనటం, ఇంకా
ఎన్నో అసంబద్దతల తొలగింపు పై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఇది విద్యార్థుల సహజ న్యాయ
సూత్రాలకు విరుద్ధమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శాశ్వత
పదోన్నతుల ఛానల్ కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు.