ఏపీడబ్ల్యూజేఎఫ్ బృందానికి సమాచారం శాఖ జాయింట్ డైరెక్టర్ తెళ్ల కస్తూరి హామీ
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న జీవో ప్రకారం అర్హులందరికీ
అక్రిడేషన్ల మంజూరులో జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు
తీసుకుంటామని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు
బృందానికి సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరీ హామీ ఇచ్చారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం బుధవారం సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రత్యేకంగా
కలిసి అక్రిడేషన్ల మంజూరు పై చర్చించారు. అనంతరం సమాచార శాఖ జాయింట్
డైరెక్టర్ కస్తూరికి వినత పత్రం అందజేశారు. దీనిపై సమాచార శాఖ జాయింట్
డైరెక్టర్ కస్తూరి సానుకూలంగా స్పందించారు.
మిగతా వారికి ఫ్రీలాన్స్ విధానంలో అక్రిడేషన్ల మంజూరు చేస్తామని అన్నారు. ఈ
మేరకు అన్ని జిల్లాల డిపిఆర్ఓ లకు సమాచారం అధికారికంగా పంపిస్తామని తెలిపారు.
సంబంధిత జర్నలిస్టులు డిపిఆర్ఓ లను సంప్రదించి, వారి సూచనల మేరకు దరఖాస్తు
చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.
చిన్న పత్రికలకు పాత జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా కొత్త జిల్లా
కేంద్రానికి కూడా అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరీ
ఆమోదం తెలిపారు. ఈ చర్చల్లో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ను కలిసిన వారిలో
ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, రాష్ట్ర
ఉపాధ్యక్షుడు వాతడ నవీన్ రాజ్, రాష్ట్ర నాయకులు ఈశ్వరరావు, ప్రసాద్, శ్రీను,
అధికార్, కాకినాడ జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు బోట్ల లోవరాజు, సత్య
ఉన్నారు.