అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఇది ఉదయం 10:40 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. “ప్రమాదం జరిగిన ప్రదేశానికి రహదారి సౌకర్యం కూడా లేదు. రెస్క్యూ టీమ్‌ను అక్కడకి పంపించాం” అని ఎగువ సియాంగ్ పోలీస్ సూపరింటెండెంట్ జుమ్మర్ బసర్ చెప్పారు. కుప్పకూలిన హెలికాప్టర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
“చాపర్ లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటివరకు నలుగురు సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మరో వ్యక్తి కోసం అన్వేషణ కొనసాగుతోందని” తేజ్‌పూర్‌కు చెందిన రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఏఎస్ వాలియా తెలిపారు.
మూలం: టెలిగ్రాఫ్ ఇండియా