ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే భేటీ
న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు
పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా
అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం పదవిని ఆశిస్తున్న
సిద్ధరామయ్య, శివకుమార్‌లు కూడా పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో విడివిడిగా భేటీ
అయ్యారు. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు
తెలుస్తోంది. అయితే సీఎం ఎంపికపై పార్టీ అధిష్ఠానం బుధవారం నిర్ణయం
తీసుకోబోతున్నట్లు సమాచారం.