253 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ
వ్యవస్థను ప్రవేశపెట్టి.. పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని
పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
అన్నారు. 59 వ డివిజన్ 253 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నగర డిప్యూటీ మేయర్
అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా, అధికారులతో
కలిసి అజిత్ సింగ్ నగర్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. 260 గడపలను
సందర్శించి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రజల సమస్యలు అడిగి
తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించారు. సైడ్ కాలువల్లో నీరు పారేలా
ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కూలిన, పగుళ్లిచ్చిన
సైడ్ డ్రెయిన్ల పున: నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్
అధికారులకు సూచించారు. అలాగే ట్యాంక్ రోడ్డులో కల్వర్టు ఎత్తు పెంచి సైడ్
కాలువలో పారుదల ఉండేలా చూడాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఒక సువర్ణ అధ్యాయం
దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందని
మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల పేరిట
దోచుకోవడం, పేదల సొమ్ము తినేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కానీ
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా
ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల
మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కాగా తొలి దశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా
జరుగుతున్నట్లు వెల్లడించారు. అలాగే అమరావతిలో ఇళ్లు మంజూరైన వారికి సైతం
త్వరలోనే పట్టాలు అందజేస్తామని తెలియజేశారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందవలసిన
అవసరం లేదని.. సంబంధిత సచివాలయాలలో దరఖాస్తు చేసుకున్నట్లయితే 90 రోజుల
కార్యక్రమం కింద మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
పెయిడ్ ర్యాలీలతో పరువు పోగొట్టుకున్న టీడీపీ నేతలు
టీడీపీ నేత నారా లోకేష్ ది ఒక ఫెయిల్యూర్ యాత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విమర్శించారు. లోకేష్ కు మద్ధతుగా జిల్లాలో టీడీపీ శ్రేణులు చేసిన ర్యాలీలు
నీరసంగా సాగాయని ఎద్దేవా చేశారు. ఎక్కడ పరువు పోతుందోనని చివరకు డబ్బులిచ్చి
కిరాయి జనాలతో ఊరేగింపులు చేశారని ఆరోపించారు. మీ ఆర్భాటపు పెయిడ్ యాత్రలతో
ట్రాఫిక్ కష్టాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
అఖండ పూర్ణాహుతిలో భాగస్వాములుకండి
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అఖండ యజ్ఞం, జరగబోయే
పూర్ణాహుతితో పరిసమాప్తం కానుందని మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఉదయం 11.38 గంటలకు ఈ అఖండ పూర్ణాహుతి
జరుగుతుందని తెలియజేశారు. అలాగే భక్తులకు భారీస్థాయిలో అన్న సంతర్పణకు ఏర్పాటు
చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలందరి
సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ యాగంలో భక్తులందరూ భాగస్వాములు
కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్,
దేవిరెడ్డి రమేష్ రెడ్డి, కంభగళ్ల రాజు, వేణు, గోనెల కృష్ణ, నేరెళ్ల శివ,
మీసాల సత్యనారాయణ, నాయక్, బాలనాగమ్మ, శాంతకుమారి, జిలానీ, చింతా శ్రీను,
నాగుల్ మీరా, బాబా, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.