విజయనగరం : ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బిజెపి రాష్ట్ర
అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. మంగళవారం విజయనగరం జిల్లాలో
ఛార్జిషీట్ దాఖలు చేసే కార్యక్రమం లో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ
ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి జనవరిలో కొనాల్సిన 50 టన్నుల బెల్లం
ఇప్పటివరకు కొనక పోవడంతో బెల్లం ముద్దలుగా మారి నీరు కారుతుందని ఆవేదన వ్యక్తం
చేశారు. చక్కెర పరిశ్రమ కార్మికులకు రావాల్సిన బకాయిలు పై వినతిపత్రం
అందించారు. రైతాంగ పోరాటానికి ఛార్జిషీట్ లు వేదికగా ప్రభుత్వం పై వత్తిడి
తెస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదిక గా రాష్ట్ర స్థాయిలో
ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షురాలు
రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు.