హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్
ఏసీ బస్సులను మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
లాంఛనంగా ప్రారంభించారు. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు
మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ‘ఈ-గరుడ’ ముఖ్య ఉద్దేశం
అన్నారు. రానున్న రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి
తెస్తున్నామని, వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర
ప్రాంతాలకు నడుపుతామన్నారు.

సంస్థ చైర్మన్, శాఖ ఉన్నతాధికారితో మంత్రి పువ్వాడ సమావేశం.
టీఎస్ ఆర్టీసీ, రవాణా శాఖలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తన ఛాంబర్ లో ఆర్టీసీ సంస్థ చైర్మన్
బాజిరెడ్డి గోవర్ధన్, సెక్రటరీ శ్రీనివాస్ తో చర్చించారు. సంస్థ అందిస్తున్న
సేవలు, కొనసాగుతున్న పౌర సేవలు, ప్రజా రవాణా తదితర అంశాలపై చర్చించారు.