పోటీ పరీక్షలకు సన్నద్దమౌతున్న యువతీ, యువకులతో మాటా-మంతి
1980 నుండి 1985 వరకు గ్రంధాలయం లో తన అనుభవాలు పంచుకున్న మంత్రి
శ్రద్ధగా ఆలకించిన యువతీ యువకులు
వేసవి తాపం నుండి రక్షణకు చర్యలు
ఆధునిక పరిజ్ఞానంతో గ్రంధాలయ ఏర్పాటుకు హామీ
స్వయం ఉపాధి పై మహిళలు దృష్టి సారించాలి
అందుకే మహిళలకు ఓరియంటేషన్ శిక్షణ
విద్య ఉపాధి కోసం ఉద్యోగం కోసం కాకూడదు
విద్యార్థి యువత తో మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : పోటీ పరీక్షల కోసం జిల్లా గ్రంధాలయానికి వచ్చే విద్యార్థి, యువత
కు స్నాక్స్ తో పాటు సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్లు
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం
ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
పోటీ పరీక్షలకు సన్నద్దమౌతున్న యువతీ యువకులతో ఆయన మాట-మంతి సాగించారు.1980
నుండి 1985 వరకుగ్రంధాలయం లోని స్వీయ అనుభవాలు మంత్రి జగదీష్ రెడ్డి
వెల్లడిస్తుంటే వారు శ్రద్ధగా ఆలకించారు.వేసవి తాపం నుండి రక్షణగా ఉండేలా
కూలర్లు తదితర ఏర్పాట్లు చేయాలంటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు
జారీచేశారు. ఆధునిక పరజ్ఞానంతో కూడిన గ్రంధాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన
పేర్కొన్నారు. స్వయం ఉపాధి పై మహిళలు దృష్టి సారించాలని ఆయన
పిుపునిచ్చారు.అందుకు అవసమైన ఓరియంటేశన్ శిక్షణకు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన
వెల్లడించారు. విద్య ఉపాధి కోసమని, ఉద్యోగం కోసం కాకూడదని ఆయన విద్యార్థి
యువతకు హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడాలని, అదే సమయంలో
ప్రబుత్వ ఉద్యగమే పరమావధి కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి వారికి ఉద్బోధించారు.