కొవ్వూరు : కొవ్వూరు మండలం పెనకనమెట్టలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని
రాష్ట్ర హోమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
దర్శించారు. శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆలయంలో జరిగిన
ప్రత్యేక పూజా కార్యక్రమాలలో హోంమంత్రి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు,
పండితులు మంత్రిని పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో
నిర్వహించిన అన్న సమారాధనలో పాల్గొని భక్తులకు హోం మంత్రి స్వయంగా
తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఎక్కడ చూసినా హనుమాన్ జయంతి
శోభను సంతరించుకున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ, కొవ్వూరు నియోజకవర్గ
ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు కలగాలని ప్రార్ధించినట్లు తెలిపారు. దేవుడి
ఆశీస్సులతో ప్రతి కుటుంబం సంతోషంగా, ఆనందంగా ఉండాలని హోంమంత్రి తానేటి వనిత
ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పెద్ద
ఎత్తున భక్తులు పాల్గొన్నారు.