హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్టేటివ్, పార్లమెంటరీ
పార్టీ మీటింగ్ బుధవారం జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ
సమావేశంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. ఈ
సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణలో ఎన్నికలు
సమీపిస్తుండటంతో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో
అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధానాలపై సమావేశంలో
చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనంతరం
మొదటి సమావేశం కావడంతో ఆ ఎన్నికల ఫలితాలు మన రాష్ట్రంలో ఏ మేరకు ప్రభావం
చూపుతాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు
చేస్తున్న ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి అనే దానిపై పార్టీ పెద్దలు సమావేశంలో
చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.