ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి తీర్మానం
విజయవాడ : సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర బిజెపి ప్రభుత్వం
మోసపూరిత హమిలకు నిరసన గా రాష్ట్ర వ్యాప్తంగా మే 26 నుండి 30వరకు
ప్రదర్శనలు,ధర్నాలు, పార్లమెంటు సభ్యులకు మెమోరాండమ్ లు అందించాలని
ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి తీర్మానించిందని రైతుసంఘాల సమన్వయ సమితి
రాష్ట్ర కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు చెప్పారు. సోమవారం ఆంధ్రప్రదేశ్
రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు వడ్డే
శోభనాద్రీశ్వరరావు అధ్యక్ష్యతన జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో బాగం మన రాష్ట్రంలో విజయవంతం చేయాలని
పిలుపునిచ్చారు. ఈ నెలలో వారం రోజుల పాటు భారీగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో
9లక్షల ఎకరాల్లో ధాన్యం, జోన్న, మొక్కజొన్న, పసుపు, మిర్చి పంటలు తీవ్రంగా
దెబ్బతిన్నాయని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. పెట్టుబడులు పెట్టి ఆరుగాలం
కష్టపడి పండించిన రైతాంగం పంటలు నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సడలించి
దెబ్బతిన్న పంటల మొత్తాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని అన్నారు.
రైతుసంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ లో వాస్తవ
సాగుదారులైన కౌలురైతుల పేర్లు నమోదు చేయలన్నారు. పరిహారం కౌలురైతులకే
అందించాలన్నారు. దెబ్బ తిన్న అన్ని పంటలకు భీమా పరిహారం వచ్చేందుకు చర్యలు
తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తీర్మానాలు ఇవీ : స్వామినాథన్ కమిషన్ సూచించిన సి 2+50 ప్రకారం అన్ని పంటలకు
మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలి. రైతుల,కౌలురైతుల ప్రభుత్వం, ప్రయివేటు
అప్పులన్ని పూర్తిగా మాఫీచేయాలి,విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి,
వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల ఏర్పాటు విరమించాలని, రైతు ఉద్యమం సందర్భంగా
రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తదితర తీర్మానాలను చేశారు.
ఈ కార్యక్రమంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ
వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కుర్రా
నరేంద్ర, రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్రనాయకులు పి.జమలయ్య, వి.కృష్ణయ్య,
చుండూరు రంగారావు,సింహాద్రి ఝాన్సీ, యం.వెంకట్ రెడ్డి, నరహరిశెట్టి
నరసింహారావు, కొల్లా రాజమోహన్ ,వెల్పుల నరసింహారావు, తోట ఆంజనేయులు, మరీద
ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.