భద్రత కల్పిస్తూ నవరత్నాల పథకాలు కూడా ప్రత్యేకంగా వీరికి అందేలా రాష్ట్ర
ప్రభుత్వం వెంటనే గతంలో విడుదల చేసిన జి.వో నెంబర్ 1/2003లో మార్పులు
చేయాలని, అక్రమ రవాణా బాధిత మహిళలు వ్యాపార లైంగిక దోపిడి బాధితుల రాష్ట్ర
సమాఖ్య విముక్తి అధ్యక్షురాలు అపూర్వ, ప్రధాన కార్యదర్శి పుష్పావతి రాష్ట్ర
ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇటీవల
‘‘ట్రాన్స్ జండర్’’ కమ్యూనిటి వారికి ‘‘సామాజిక భద్రత’’ కల్పిస్తూ
ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొన్ని నిర్ణయాన్ని
తాము ఆమోదం తెల్పుతూ ఉన్నామని విముక్తి ఉపాధ్యక్షురాలు జ్యోతి, మౌనిక రాష్ట్ర
ప్రభుత్వం ను అభినందించారు.
అయితే రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి గణాంకాలు ప్రకారం 1.33 లక్షల మంది
మహిళలు ప్రస్థుతం వ్యభిచారంలో మ్రగ్గుతున్నారని, అలాగే జాతీయ నేర గణాంకాల శాఖ
విడుదల చేసిన లెక్కలు ప్రకారం రాష్ట్రానికి చెందిన 2,596 మంది మహిళలు, పిల్లలు
2016 నుంచి 2021 వరకు అక్రమ రవాణా నుంచి విముక్తి కాబడ్డారు. కాని వాస్తవంగా
నేడు రాష్ట్రంలో ఇంతకు రెండింతల మంది మహిళలు, పిల్లలు వ్యభిచారంలో
ఉన్నారన్నారు.
2003 సంవత్సరంలో సుప్రింకోర్టు ఆదేశాల మరకు రాష్ట్ర ప్రభుత్వం
జి.వో.నెం.1/2003 ను అక్రమ రవాణా మహిళలు, పిల్లలుతో పాటు వ్యభిచారంలో
మ్రగ్గుతున్న మహిళలకు పునరావాసం, ఇతర సామాజిక సమస్యలు ఎదుర్కోవడానికి వీలుగా
అనేక పథకాలు ఈ జి.వో లో పొందుపరిచారు అన్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
విడిపోయిన తర్వాత 2015 నుంచి అసలు ఈ జి.వో అమలు కావడంలేదని, అలాగే ఈ జి.వో
అమలుకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించడం లేదన్నారు. వెంటనే
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని జి.వో నెంబర్.1/2003ను కొన్ని మార్పులు,
చేర్పులతో కమ్యూనిటి అధారిత పునారావాసం కల్పిస్తూ పునరుద్దరించాలని, అలాగే ఈ
జి.వో అమలు కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి కమిటి ఏర్పాటు చేసి అందులో
బాధితులను కూడా సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్థుతం
విజయవంతంగా అమలు అవుతున్న నవ రత్నాలు పథకాలలో సెక్స్ వర్కర్లుకు ప్రత్యేక
కోటా ఏర్పాటు చేసి వీరిని వెంటనే ఆదుకోవాలని, రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక
కార్యక్రమాలు, చర్యలు కల్పనలో అక్రమ రవాణా బాధిత మహిళలను భాగస్వామ్యం చేయాలని
వారు ఆ వినతి పత్రంలో కోరారు.