జిల్లా కలెక్టర్ కు ఏఐటీయూసీ నేత తాటిపాక మధు విజ్ఞప్తి
డీసీఎల్ కు మెమో ఇచ్చి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటా
కాకినాడ జిల్లా కలెక్టర్ వెల్లడి
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పరిశ్రమ
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యానికి అనుకూలంగా
వ్యవహరిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్
లేబర్ కాకినాడ వారిని వెంటనే బదిలీ చేయాలని అతని అక్రమాలపై విచారణ చేసి తగిన
చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కాకినాడ
జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఏఐటీయూసీ నేతలు కే బాడకొండ తదితర నేతలు
డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్పందనలో జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం
అందజేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఆంధ్ర పేపర్ మిల్ పాత
గుర్తింపు సంఘం కాల పరిమితి 2019 డిసెంబర్ తో ముగిసిపోయిందని ఆయన అన్నారు
కాకినాడ డీసీఎల్ 2020 ఫిబ్రవరి లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారని మధు
అన్నారు ఓటర్ లిస్టు కూడా జారీ చేశారని అయితే కోవిడ్ కారణంతో ఎన్నికల
ప్రక్రియ వాయిదా పడిందన్నారు ఈ సందర్భంగా పాత గుర్తింపు సంఘం హైకోర్టులో
ఎన్నికల నిలుపుదల కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసిందని కోర్టు ఎలాంటి మధ్యంతర
ఉత్తర్వులు ఇవ్వకపోయినా దాదాపు మూడు సంవత్సరాలు జిల్లా కార్మిక శాఖ అధికారులు
ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యానికి పాత గుర్తింపు సంఘానికి వత్తాసు
పలుకుతున్నారని మధు కలెక్టర్ వివరించారు. కోర్టులో కేసు వేసిన సంఘమే 2023
మార్చ్ లో కేసు విత్ డ్రా చేసుకున్న యాజమాన్యానికి తొత్తుగా ఉన్న డిసిఎల్
ఎన్నికలు జరుపుకుందో కుంటి సాకుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. 8 కార్మిక
సంఘాలు పలుమార్లు కాకినాడ డీసీఎల్ ఆఫీసులో సమావేశంలో కూర్చున్న ఏదో వంకతో
వాయిదా వేస్తున్నారని డీసీఎల్ వైఖరి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఉందని మధు
తెలిపారు మీ పరిధిలో పనిచేస్తున్న డీసీఎల్ కాబట్టి ముందుగా మీకు వినతిపత్రం
ఇస్తున్నామని అనంతరం కార్మిక శాఖ కమిషనర్ కలిసి ఆందోళన చేపడతామని మధు తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్పందన : మధు చెప్పిన విషయాన్ని పూర్తిగా విన్న జిల్లా
కలెక్టర్ డీసీఎల్ ను పిలవగానే ఆయన రాకపోవడంతో ఏసిఎల్ వచ్చారు ఏరి మీ డిసిఎల్
అని అడిగితే ఆమె బదులిస్తూ కోర్టుకెళ్లారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సీరియస్
అయ్యి సాయంత్రం కల్లా నా ఛాంబర్ కి రావాలని పేపర్ మిల్ విషయం చర్చించాలని
లేకుంటే మెమో జారీ చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.