అఖిల పక్షాలను కలుపుకుని సీఎం కేంద్రంపై ఒత్తిడి
రౌండ్ టేబుల్ సమావేశంలో ఇతర వక్తలు
విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా కేంద్ర
ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తూ అన్యాయం చేస్తుందని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి కె. రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి
ఆధ్వర్యంలో దాసరి భవనంలో ‘పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించకుండా కేంద్ర
ప్రభుత్వం అన్యాయం చేస్తుంది’ అనే అంశంపై అన్ని
రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ఇతర
ప్రజాసంఘాలను ఆహ్వానిస్తూ కే. రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం రౌండ్ టేబుల్
సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ఇరిగేషన్ ప్రధాన
కార్యదర్శి శశి భూషణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ పోలవరం
ప్రాజెక్టు నిర్మాణం కోసం కోట్ల రూపాయలు మంజూరు చేయాలని స్పష్టంగా లేఖ
రాశారన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు
కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు.