నియోజకవర్గంలో
కొనసాగుతోంది. వెలుగోడు అటవీ ప్రాంతంలో సేవ్ టైగర్ క్యాంపైన్ ప్రతినిధులు నారా
లోకేశ్ ను కలిశారు. ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్
డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్.
పులిపాక బాలు పులుల సంరక్షణపై లోకేశ్ తో చర్చించారు. రానున్న రోజుల్లో
ప్రభుత్వాలు పులుల పరిరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై మాట్లాడారు.
అడవులను, పులులు, ఇతర వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా
ఉందని నారా లోకేశ్ తెలిపారు. అడవులు తరిగిపోవడం వలనే విపరీత వాతావరణ మార్పులు
చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. టిడిపి హయాంలో అడవుల సంరక్షణ కోసం అనేక
చర్యలు
తీసుకున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ “మియావాకి మోడల్ లో ప్రతి నియోజకవర్గం లో మినీ
అడవులు తయారు చెయ్యాలి అని టిడిపి హయాంలో పైలట్ ప్రాజెక్టులు కూడా చేసాం. అరకు
కాఫీ కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. గిరిజన ఉత్పత్తులను ఎంత గానో
ప్రోత్సహించడం జరిగింది.
నాకు అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. ఇతర
దేశాలు, ఇతర రాష్ట్రాలు, సింగపూర్ లాంటి దేశాలు ఏకో టూరిజం పట్ల ఎంతో శ్రద్ధ
పెట్టారు. నేను కుటుంబంతో కలిసి అనేక టైగర్ రిజర్వ్ ఏకో టూరిజం ప్రాజెక్టులు
సందర్శించాను. రాష్ట్రంలో టైగర్ , ఏకో టూరిజం ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా
గుర్తింపు తీసుకురావాలి అనే ఆలోచన తోనే మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఎకో
టూరిజం వలన అనేక లాభాలు ఉన్నాయి. అడవులను
కాపాడటం తో పాటు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడుకోవచ్చు. భవిష్యత్తు తరాలకు
మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం లక్ష్యంగా పనిచేస్తాం.
అడవులను, పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఇమ్రాన్ సిద్దిఖీ, పులిపాక బాలు
లాంటి వారి సలహాలు తీసుకొని ప్రోటోకాల్స్
రూపొందించుకొని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని అన్నారు.
ఈ క్రమంలో ఇమ్రాన్ సిద్దిఖీ, పులిపాక బాలు మాట్లాడుతూ “సేవ్ ది టైగర్
క్యాంపెయిన్ లో
భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు. పులుల సంరక్షణ కోసం ఎంతో కాలంగా మేము కృషి
చేస్తున్నాం. భావి తరాలకు ప్రకృతి ని అందించాలి అనే లక్ష్యంతో మేము పని
చేస్తున్నాం. బెటర్ లైఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అనే కాన్సెప్ట్ తో అడవులు,
పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటమే లక్ష్యంగా అనేక సంస్థలతో కలిసి
పనిచేస్తున్నాం.
ఇతర రాష్ట్రాల్లో టైగర్ ఏకో టూరిజం సర్క్యూట్స్ అభివృద్ది చెయ్యడం ద్వారా
అడవులు, పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. టైగర్
ఏకో టూరిజం ఏర్పాటు వలన అటవీ ప్రాంతాల్లో నివసించే వేలాది మందికి ఉపాధి,
ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అడవులు, పులులు, ఇతర వన్య ప్రాణులను
కాపాడటానికి అనేక ప్రోటోకాల్స్ రూపొందించాలి. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న
గిరిజనుల స్థితి గతులు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కోసం టైగర్ ఏకో
టూరిజం ఎంత గానో ఉపయోగపడుతుంది. మృగాల కారణంగా అటవీ ప్రాంతం బయట మనుషులు
ఎదుర్కునే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.
అటవీ ఉత్పత్తులకి ప్రత్యేక బ్రాండింగ్తీ సుకురావడం వలన అడవుల పై ఆధారపడిన వారి
జీవన ప్రమాణాలు మారతాయి. కర్నూలు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నన్నారి ఉంది.
దీనిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తే స్థానికులకు ఉపయోగం ఉంటుంది. సేవ్ ది
టైగర్ క్యాంపెయిన్ లో మేము భాగస్వామ్యం అవుతాం. అడవుల సంరక్షణ కోసం
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రత్యేకంగా నిధులు
కూడా కేటాయిస్తాం.
శ్రీశైలం టైగర్ రిజర్వ్ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.