ప్రవేశాలలో గరిష్ట వయోపరిమితి ఐదు సంవత్సరాలకు సడలింపు
మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కె. వి.ఉష శ్రీచరణ్
అమరావతి : జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల సంపూర్ణ సాధికారతకు
కట్టుబడి ఉందని మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ
మంత్రి కె. వి. ఉష శ్రీచరణ్ అన్నారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ఇటీవల
ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో దివ్యాంగులకు సలహా మండలిని,
జిల్లాలలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కమిటీలను ఏర్పాటు
చేయడం జరిగిందన్నారు.
దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించి, వారు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా
జీవించుటకు, సమాజంలో వారికి పూర్తి భాగస్వామ్యం కల్పించుటకు విద్యా అవకాశాలు
మెరుగు పరచవలసిన అవసరం ఉన్నదని జగనన్న నమ్మారు. అందులో భాగంగానే జగనన్న అన్ని
ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ ఎయిడ్ పొందుతున్న ఉన్నత విద్యా
సంస్థలలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా దివ్యాంగత్వం వలన దివ్యాంగులు విద్యను పొందుటకు ఆలస్యం అయ్యే
అవకాశం ఉన్నందువలన, వారికి సమాన అవకాశాలు కల్పించుటకు, ఉన్నత విద్యాసంస్థలలో
ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిని ఐదు సంవత్సరాల సడలింపుకు ఆదేశాలు జారీ
చేసినట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల సంపూర్ణ
సాధికారతకు కట్టుబడి ఉందని మరొక్కసారి తెలియ జేసుకుంటున్నానన్నారు.