చేయకపోతే మహోన్నత ఉద్యమమే
ఎన్ టి ఏ (నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్)
విజయవాడ : 15 రోజులు లోపల ఉపాధ్యాయులకు పదోన్నతి చానల్ ఇతర విభాగాలు మాదిరి
ఏర్పాటు చేయకపోతే మహోన్నత ఉద్యమం నిర్మిస్తామని, అవసరమైతే న్యాయపోరాటం
చేస్తామని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కరణం
హరికృష్ణ, మాగంటి శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖామాత్యులు , పాఠశాల విద్య ముఖ్య
కార్యదర్శి, పాఠశాల విద్య సంచాలకుల వారికి ఉద్యమ నోటీసులు మెయిల్ ద్వారా పంపడం
జరిగిందని తెలిపారు. అంతవరకు ఉపాధ్యా యులు 2 దశాబ్దాలుగా నష్టపోతున్న వైనాన్ని
జేఏసీ నాయకత్వాలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తుల ద్వారా
ప్రాతినిధ్యాల ద్వారా, చర్చా వేదికల ద్వారా తెలియజేయడం జరుగుతుందని చెప్పారు.
” ఉపాధ్యాయ ఆత్మగౌరవ ఉద్యమం”2 తొలి దశ కార్యాచరణ లో భాగంగా
మే13 వ తేదీ నుండి మే16 వ తేదీ వరకు జేఏసీల నాయకత్వానికి, విద్యాశాఖా
మాత్యులకు ఉపాధ్యాయ పదోన్నతులు ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం
జరుగుతుందన్నారు. మే17వ తేదీ నుండి మే 20వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ సంచాలకుల వారికి
ప్రాతినిధ్యం చేయడం జరుగుతుందని తెలిపారు. మే21వ తేదీ నుండి 25 వ తేదీ వరకు
ఉపాధ్యాయుల పదోన్నతి ఛానల్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు నిర్వహించడం
జరుగుతుందని వివరించారు. ఉద్యమ కార్యాచరణ నోటీసు గడువు 15 రోజులు ముగిసిన
తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతి ఛానల్ ఇతర విభాగాల మాదిరి ఏర్పాటు కాని పక్షంలో
“ఉపాధ్యాయ ఆత్మగౌరవ ఉద్యమం 2 “చేపట్టడం జరుగుతుందని విశదీకరించారు. నేడు
విద్యాశాఖ మంత్రి, జేఏసీ నాయకులకు పదోన్నతుల ఛానల్ ఏర్పాటు చేయాలని కోరుతూ
అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు వాట్సాప్ రూపంలో, మెయిల్ లో ద్వారా పంపడం జరిగిందని
వివరించారు. నేటి విజ్ఞప్తుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైందని
తెలిపారు. ఇదే స్ఫూర్తితో తొలి దశ ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలని ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చారు.