పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయంలో పూజలు
నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు గారు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ దార్శనికత తో రాష్ట్రం అన్ని
రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి
చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను
అని మంత్రి తెలిపారు. సీఎం కెసిఆర్ గారి స్ఫూర్తి తో తాను తన పాలకుర్తి
నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లుగా చెప్పారు.
అంతకు ముందు మంత్రికి, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
దర్శనానంతరం అర్చకులు మంత్రికి, స్వామి వారి పట్టు వస్త్రాలతో, తీర్థ
ప్రసాదాలతో ఆశీర్వచనం అందించారు.