ఏపిజెఏసి అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు & పలిశెట్టి దామోదరరావు
ఎమ్యెల్యే, ఎంపీ లను కలసి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించేందుకు సహకరించాలి
జిల్లాలలో విజ్ఞప్తులు చేస్తున్న ఏపిజెఏసి అమరావతి నాయకులు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు
, ఔట్ సోర్శింగ్ వైద్యోగులు ఎవ్వరు కూడా ప్రస్తుతం సంతోషంగా లేక పోవడానికీ
కారణం ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో చూపిస్తున్న నిర్లక్ష్యధోరణే
కారణమని ఏపిజెఏసి అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు & పలిశెట్టి
దామోదరరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల న్యాయమైన
డిమాండ్లు పరిష్కరించేవిదంగా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఉద్యోగులు కూడా
ప్రభుత్వం లో బాగస్వాములే అంటున్న ప్రభుత్వం మాటనిలబెట్టుకొనేలా
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 మంది యం.యల్.ఏ, యం.పి లు అందరు సహకరించాలని
విజ్ఞప్తి చేసారు. ప్రస్తుత డిమాండ్లు ఏమీ కూడా ఉద్యోగులు గొంతమ్మకొర్కేలు
కాదని, ప్రభుత్వం ఏర్పడకముందు, ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే
అమలు చేయమని కోరుతున్నామని ఏపిజెఎసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్
టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వివి మురళి కృష్ణ నాయుడు శనివారం ఒక ప్రకటన
ద్వారా తెలిపారు.
ఏపిజెఏసి అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం నేటికి 65 రోజులకు
చేరుకున్నప్పటికీ ప్రభుత్వం నేటికీ ప్రధానమైన ఆర్ధిక పరమైన అంశాలపై అనగా
నాలుగు డి ఏ అరియర్స్ కు సంబందించి షుమారు మూడు వేల (3000) కోట్ల జీపీఎఫ్
ఖాతాలకు వేయడం, షుమారు 1800 కోట్లు సి పి ఎస్ మరియు పెన్షనర్లకు నగదు రూపంలో
చెల్లించడం, వేల కోట్ల పి అర్ సి బకాయిలు (ఇంకా లెక్క తేలాల్సి ఉంది)
చెల్లింపులు, 11వ పీ ఆర్ సి రికమెండ్ చేసిన పే స్కేల్స్ ఆమోదం తదితర అంశాలపై
ఎలాంటి స్పష్టమయిన ఆదేశాలు జారీ కాలేదని, ఇంకా ఇలాగే మా ఉద్యమాన్ని ప్రభుత్వం
చిన్నచూపూ చూస్తే మాత్రం ఇప్పటికే ఈనెల 9 శ్రీకాకుళంలో మొదటీ ప్రాంతీయ
సధస్సుతో ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు శ్రీకాకారం చుట్టాం. రెండవ ప్రాంతీయ
సధస్సును కూడా ఈనెల 17 న అనంతపురంలో నిర్వహించేందుకు అన్నిఏర్పట్లు
చేస్తున్నామని వారు తెలిపారు. ఈ ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలగాలంటే
ఇచ్చిన హామిలపైన, జరిగిన చర్చలపై స్పష్టమైన లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చేలా
ప్రజాప్రతినిధులంతా ఈ ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు,
దామోదరరావు విజ్ఞప్తిచేసారు.