విజయవాడ : ప్రజాసేవే పరమావధిగా స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్
పనిచేస్తుందని ఆ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్ చెప్పారు .
శనివారం విజయవాడ పున్నమి హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ట్రస్టు తరుపున పలు
కార్యక్రమాలను నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారితో జరిగిన ఈ
ఆత్మీయ కలయికలో ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పులి
శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ ఫేస్ బుక్ మిత్రుల సహకారంతో తాము దేశవ్యాప్తంగా
పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో కేరళలో తుఫాన్
వచ్చినప్పుడు ఫేస్బుక్ మిత్రుల సహకారంతో ఒక లక్ష 11 వేల రూపాయల వరకు సేకరించి
నాటి ఏపీ సీఎం చంద్రబాబు ద్వారా ఆనాటి కేరళ సీఎంకు ఆ డబ్బును పంపించడం
జరిగిందనీ అన్నారు. అలాగే తిత్లి తుఫాను సమయంలో ఇదే తరహాలో 70 వేల రూపాయలు
సేకరించి బాధితుల సహాయార్థం అందజేయడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న వారిని
ఆదుకోవడానికి మించిన మానవత ఏమీ లేదని ఆయన అన్నారు . గత 33 సంవత్సరాలుగా
సామాజిక సేవా దృక్పథంతో తాను చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ
ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్
సభ్యులు దేవి సుకన్య ఆడిట్, చాంద్ బాషా, కొత్తపల్లి నాగజ్యోతి, రాహిత్య,
చెన్నకేశవులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన
సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ బ్రోచర్ ను
ఆవిష్కరించారు.