తుళ్లూరు : రాజధాని పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద
ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా ‘జైభీమ్’ పార్టీ
వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన
పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అంబేడ్కర్ స్మృతివనం వద్దకు రైతులు
బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో
అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్-5 జోన్‌కు
వ్యతిరేకంగా అంబేడ్కర్ స్మృతివనంకు పాదయాత్ర తలపెట్టిన రైతులను పోలీసులు
అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి సెంటు భూమి
ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అమరావతి రైతులు
నిరసన తెలుపుతూ ఆర్-5 జోన్లో లేఔట్ పనులు చేపట్టకుండా గత కొద్దిరోజులుగా
అడ్డుకుంటున్నారు. పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ నిరసన తెలుపుతున్నారు. ఈ
ఆందోళనలో భాగంగా రైతులు శనివారం తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి శాఖమూరు వద్ద
ఉన్న అంబేడ్కర్ స్మృతివనం వరకు పాదయాత్ర చేయటానికి సన్నద్ధమయ్యారు. దీంతో
అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీక్షా శిబిరం నుంచి రైతులు, మహిళలు, రైతు
కూలీలను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు. పోలీసులను తోసుకొని
బయటికి రావడానికి రైతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య
తోపులాట జరిగింది. కొంతమంది రైతులు దీక్షా శిబిరం వెనుక వైపు నుంచి పొలాల్లోకి
వెళ్లి అక్కడ నుంచి స్మృతివనం చేరుకున్నారు. మరికొంతమంది రైతులను పోలీసులు
అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో ఆ తర్వాత పరిమిత సంఖ్యలో స్మృతివనంకు
వెళ్లేందుకు అనుమతించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం అమరావతి ఐకాస
నేతలు స్మృతివనం వద్దకు వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి
నినాదాలు చేసి నిరసన తెలిపారు.