హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో
2023-24 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాలను ఈ నెల 15 నుంచి
ప్రారంభించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. జూన్ 1 నుంచి తరగతులు
ప్రారంభించి, అదే నెల 30 వరకు ప్రవేశాలు పూర్తి చేయాలి. ఈ మేరకు బోర్డు
కార్యదర్శి ప్రవేశాల కాలపట్టికను శుక్రవారం జారీ చేశారు. ఇంటర్‌బోర్డు అనుబంధ
గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని, వాటి జాబితాను
www.acadtsbie.cgg.gov.in, www.tsbie.cgg.gov.in వెబ్సైట్లలో పొందుపరుస్తామని
ఆయన పేర్కొన్నారు.

వేసవిలోనూ ఇంటింటా చదువుల పంట : వేసవి సెలవుల్లోనూ విద్యార్థులు
చదువుకునేందుకు వీలుగా విద్యాశాఖ ఇంటింటా చదువుల పంట కార్యక్రమం అమలు
చేస్తోంది. మూడు నుంచి తొమ్మిదో తరగతి పూర్తి చేసిన వారు ప్లే స్టోర్ నుంచి
swift chat app డౌన్లోడ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పంపితే తెలుగు, ఆంగ్లం,
ఉర్దూ మాధ్యమాల్లో గణితం, సైన్స్, సోషల్ ప్రశ్నలు వస్తాయి. వాటికి
సమాధానాలను గుర్తిస్తే మార్కులు కేటాయిస్తారు. శుక్రవారం నాటికి ప్రశ్నలు
పూర్తి చేస్తే మళ్లీ ప్రతి శనివారం కొత్తవి వస్తాయి. ఈ కార్యక్రమం ఈ నెల 13
నుంచి జూన్ 10 వరకు కొనసాగుతుంది.