రాష్ట్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులతో
ముందుకు రావాలనీ, ఆయా సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. భారత హై కమిషనర్ విక్రమ్
కె.దొరైస్వామి ఆధ్వర్యంలో లండన్‌లో ఏర్పాటుచేసిన పారిశ్రామికవేత్తల రౌండ్
టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశానికి హాజరైన పలు
కంపెనీల ప్రతినిధులు, ఇతరులకు తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి మంత్రి
వివరించారు ‘‘తెలంగాణలో ప్రాథమిక సమస్యలన్నింటిపై దృష్టి సారించి
పరిష్కారానికి కృషిచేశాం. ఇన్నోవేషన్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన వంటి
అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి
వ్యవసాయం, ఐటీ మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైంది.
రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతమైంది. హైదరాబాద్‌లో నెలకొల్పిన ఇన్నోవేషన్
ఎకో సిస్టం, పరిశోధన సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపంచ ప్రసిద్ధ
కంపెనీలవల్ల ఆయా రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. ఏక గవాక్ష అనుమతుల
విధానం ఎనలేని మేలు చేకూర్చింది. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు
అనుమతులు ఇచ్చే ఈ విధానం ఇప్పటికే అనేక ప్రశంసలను అందుకుంది. హైదరాబాద్‌లో
టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
లభించాయి. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్,
మొబిలిటీ, టెక్స్టైల్ వంటి రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో విస్తృత
అవకాశాలున్నాయి. యూకే విద్యా సంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్
యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న భాగస్వామ్యాల
ఏర్పాటు వినూత్న అవకాశాలను కల్పిస్తోంది’’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.
తెలంగాణ ఎదుగుతున్న తీరుపై హర్షం : సమావేశంలో భారత హై కమిషనర్ విక్రమ్
కె.దొరైస్వామి మాట్లాడుతూ హెవీ మిషనరీ, ఏవియేషన్, డిఫెన్స్,
ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యూకే కంపెనీలతో భాగస్వామ్యాలకు
ఉన్న అవకాశాలను వివరించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, విభిన్న సంస్కృతుల
సమ్మేళనమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం నెలకొందని
పేర్కొన్నారు. బ్రిటిష్‌లోని భారత వ్యాపారవేత్త కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ
తెలంగాణ గత తొమ్మిదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని కొనియాడారు. నూతనంగా
నిర్మించిన సచివాలయం, 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వంటి
వాటిని కరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణ
ఎదుగుతున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక
కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.