కొనసాగుతోంది. ఆధిక్యంలో మెజార్టీ మార్క్ (113) దాటేసింది. కర్ణాటక అసెంబ్లీ
ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. మొత్తం 36 కేంద్రాల్లో ఉదయం 8
గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటలకు వెలువడిన ఫలితాల
ప్రకారం ఆధిక్యంలో కాంగ్రెస్ మెజార్టీ మార్క్ దాటింది. మొత్తం 115
స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా 73 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో
కొనసాగుతోంది. జేడీఎస్ 28 చోట్ల ముందంజలో ఉండగా 8 స్థానాల్లో ఇతరులు
ఆధిక్యంలో ఉన్నారు.
ప్రముఖుల ఫలితాల సరళి ఇలా : కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై
షిగ్గావ్లో ఆధిక్యంలో ఉన్నారు. కనకపురా స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డి.కె.
శివకుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత,
మాజీ సీఎం సిద్ధరామయ్య ఆధిక్యంలో ఉన్నారు. చెన్నపట్టణ స్థానం నుంచి మాజీ సీఎం,
జేడీఎస్ నేత కుమారస్వామి తొలుత వెనుకబడినా ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు.
హోళెనరసిపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యంలో ఉన్నారు. రామనగరలో
నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) ముందంజలో కొనసాగుతున్నారు. గాలి జనార్దన్
రెడ్డి దంపతులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గంగావతి స్థానం నుంచి జనార్దన్
రెడ్డి, బళ్లారి పట్టణలో గాలి లక్ష్మీ అరుణ ముందంజలో ఉన్నారు. సొరబ స్థానంలో
మాజీ సీఎం బంగారప్ప కుమారుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కుమార బంగారప్ప
(బీజేపీ)పై మధు బంగారప్ప (కాంగ్రెస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హుబ్బళి
ధార్వాడ్ సెంట్రల్లో మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) వెనుకంజలో
ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే
చిత్తాపూర్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప
కుమారుడు విజయేంద్ర (బీజేపీ) ముందంజలో ఉన్నారు.