బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇక, ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో
దూసుకుపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ముందంజలో దూసుకెళ్తున్నారు. దీంతో
కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ప్రస్తుత ఈసీ ట్రెండ్స్
ప్రకారం కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71
స్థానాల్లో, జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా
గాంధీ షిమ్లాలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. కర్నాటకలో కౌంటింగ్
సందర్భంగా ఆమె హనుమాన్ గుడిలో ప్రార్థనలు చేశారు. దేశం, కర్నాటక ప్రజల
శాంతి, సామరస్యం కోసం ప్రియాంకా గాంధీ ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్
నేతలు తెలిపారు. షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆమె పూజలు చేశారు.