విజయవాడ : జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రజల విజయమని
ఏపిసిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు అన్నారు. ఈ విషయంలో ప్రజల
తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి విజయం సాధించిందని తెలిపిన ఆయన జీవో నెం.1
ని ఏపీ హై కోర్టు కొట్టివేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలో సభలు,
రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను తీసుకువచ్చిన రాష్ట్ర
ప్రభుత్వాన్ని ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని హైకోర్ట్ కొట్టివేయడం
రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. జీవో నెం.1ను సవాల్
చేస్తూ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఈ విషయంలో ప్రజా పక్షాన నిలబడి విజయం
సాధించామని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో తెచ్చారని, పోలీస్
యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారన్న గిడుగు రుద్రరాజు నిరంకుశ
పాలనను కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా వ్యతిరేకిస్తుందని, ఇది ప్రభుత్వానికి
చెంప పెట్టని, ఇది ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్ పార్టీ విజయమని గిడుగు
రుద్రరాజు అన్నారు.