కీవ్ : రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఆ దేశ దళాలను వెనక్కి పంపించడానికి తమకు
కాస్త సమయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఓ
అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
యుద్ధంలో రెండో పర్వాన్ని ఇప్పటికిప్పుడు ప్రారంభించడం తమకు సాధ్యమేనని అయితే
అలా చేస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. అది ఆమోదయోగ్యం కాదని
వ్యాఖ్యానించారు. మరోవైపు రష్యా సైతం ఇదే విధంగా స్పందించింది. ప్రజల ప్రాణాలు
కోల్పోకుండా ఉండటానికే ఉక్రెయిన్‌లో తమ పోరాట వేగాన్ని తగ్గించామని
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం వెల్లడించారు.

ఉక్రెయిన్‌కు బ్రిటన్ క్రూజ్ క్షిపణులు : రష్యా దళాలను నిలువరించేందుకు
ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను అందిస్తున్నట్లు బ్రిటన్
ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ మేరకు హౌస్ ఆఫ్ కామన్స్‌లో
చట్టసభ్యులకు రక్షణ మంత్రి బెన్ వాలేస్ తెలిపారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్
అందిస్తున్న స్టామ్ షాడో క్షిపణులు రష్యా ఆక్రమిత క్రిమియా సహా 250
కి.మీ.పైబడిన దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలవు. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా
నుంచి రష్యాకు ఆయుధాలు ఎగుమతి అయినట్లు ఆదేశంలోని అమెరికా రాయబారి రూబెన్
బ్రిగేటి ఆరోపించారు.