శుక్రవారం ఉదయం దేహ్రాదూన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీని ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సాదరంగా ఆహ్వానించారు.
తర్వాత ఆయన కేదార్నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు.దేహ్రాదూన్: ప్రధాని నరేంద్రమోదీ దేవభూమి ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు.
శుక్రవారం ఉదయం ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన..
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో సంప్రదాయ తెలుపు వస్త్రాలను ధరించారు.
రెండురోజుల పర్యటనలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తోన్న ఆయన పలు అభివృద్ధి కార్యాక్రమాలను పర్యవేక్షించనున్నారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
శుక్రవారం ఉదయం దేహ్రాదూన్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సాదరంగా ఆహ్వానించారు.
తర్వాత ఆయన కేదార్నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం ఆదిగురు శంకరాచార్యుల సమాధి స్థల్‌ను సందర్శించారు. 9.7 కిలోమీటర్ల పొడవైన గౌరీకుంద్-కేదార్నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అక్కడ కూలీలతో ముచ్చటించారు.
ఇక ఈ రోజు మధ్యాహ్నం కల్లా బద్రినాథ్‌కు చేరుకోనున్నారు.
ఆ మహిళలకు మాటిచ్చినట్టుగానే వస్త్రాలు ధరించి..:ఆలయ సందర్శన వేళ.. ప్రధాని తెలుపురంగు వస్త్రాలను ధరించారు.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా ప్రాంత మహిళలు వాటిని చేతితో రూపొందించారు. ఆ దుస్తులకు చోళ డోరా అని పేరు.
ఇటీవల హిమాచల్ పర్యటనలో భాగంగా మోదీకి ఆ మహిళలు వాటిని అందించారు.
చల్లని ప్రదేశానికి వెళ్లిన సమయంలో ఆ దుస్తులను ధరిస్తానని అప్పుడు ప్రధాని వారికి హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు కేదార్‌నాథ్‌కు వచ్చిన సమయంలో ఆ మాటను నిలబెట్టుకున్నారు.