సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం
ఎండాడలోని కాపు భవన్‌కు శంకుస్థాపన
ఏపీఎల్ సీజన్-2 ను సీఎం జగన్
బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన
మ్యూజియం ప్రారంభం
విశాఖపట్నం : విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి
ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. నగర మేయర్ హరివెంకటకుమారితో పాటు
మంత్రి అమర్నాథ్, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు సీఎం
జగన్‌కు ఆత్మీయ ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు. పాలనా రాజధానిలో పలు
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి పలు శంకుస్థాపనలు చేశారు. తాడేపల్లి నుంచి గన్నవరం
ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి విశాఖకు విమానంలో బయల్దేరి నగరంలో
వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ
అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభోత్సవంతో పాటు
రామ్ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్‌తో పాటు ఎంవీపీలోని ఇండోర్స్
స్పోర్ట్స్ ఎరీనాను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ఎండాడలోని
కాపు భవన్‌కు శంకుస్థాపన, భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు
శంకుస్థాపనచేశారు.
విశాఖ పర్యటనలో పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రీడాకారులను
సీఎం జగన్ కలిశారు. మహిళా క్రికెటర్లు సబనామ్, అంజలిని ప్రత్యేకంగా
అభినందించారు. ఏపీఎల్ సీజన్-2 ను సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్సార్
స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సందర్శించి ఆంధ్ర
క్రికెట్ అసోషియేషన్ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. వైఎస్సార్
క్రికెట్‌స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ను సీఎం జగన్
ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్‌తో ముచ్చటించారు. క్రీడల్లో మరింత
రాణించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అలాగే ఆరిలోవలోని అపోలో
ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రారంభించారు. అనంతరం అక్కడి సిబ్బందితో ఆయన కాసేపు మాట్లాడి వాళ్ల విజ్ఞప్తి
మేరకు గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్ యూనిట్‌లోని రేడియేషన్
ఎక్విప్మెంట్ను సీఎం జగన్ పరిశీలించారు. ఆర్కే బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ
అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియం సీఎం జగన్ మోహన్ రెడ్డి
ప్రారంభించారు. బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన మ్యూజియంను
ప్రారంభించిన అనంతరం లోపల అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి కలియతిరిగి
తిలకించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు
కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఆశీర్వదించారు.