గుంటూరు : గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఉన్న అన్నమయ్య ఆధ్యాత్మిక
గ్రంథాలయానికి , డాక్టర్ పట్టాభి కళాపీఠము వ్యవస్థాపకులు డాక్టర్ తూములూరి
రాజేంద్రప్రసాద్ కొన్ని పుస్తకాలను గురువారం అందచేశారు. సుప్రసిద్ధ కథా నవలా
రచయిత కీ.శే. అందే నారాయణస్వామి ఆరున్నర దశాబ్దాల క్రితం రచించిన ‘ఇద్దరు
తల్లులు’, ‘కష్టసుఖాలు’ నవలల పునర్ముద్రణల బౌండ్ వాల్యూమ్స్ (పాత కాపీలు
ప్రస్తుతం అందుబాటులో లేనందున నారాయణస్వామి కుమారుడు, అందె బాబాప్రసాద్
సౌజన్యంతో మల్లెతీగ తాజాగా పునర్ముద్రించింది), సుప్రసిద్ధ చిత్రకారుడు,
కథకుడు కీ.శే. బాలి రచించిన ‘బాలికథలు’ పుస్తకాన్ని, చిన్ని నారాయణరావు తాజా
కవిత్వం ‘దాహం… దాహం’ దీర్ఘ కవితా సంపుటాన్ని అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయ
బాధ్యులు ‘కళారత్న’ లంకా సూర్యనారాయణ కి అందచేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ
‘నవమల్లెతీగ’ మాసపత్రికను మీరు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నడుపుతున్నారని, ఆ
పత్రికను మీరు క్రమం తప్పకుండా మా గ్రంథాలయానికి పంపుతున్నారని, మీరు
పత్రికకు చందా తీసుకోవాల్సిందేనంటూ మూడు సంవత్సరాలకు చందా చెల్లించి, తమ పెద్ద
మనసును చాటుకున్నారు. ఇప్పటికే ఈ గ్రంథాలయంలో 1,27,000 పుస్తకాలు (తెలుగు,
ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ), తెలుగు పత్రికలు 1066, ఇంగ్లీషు పత్రికలు 1149,
సంస్కృతం, హిందీ 11 పత్రికలు వున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గతంలో
ముద్రించిన మల్లెతీగ సాహిత్య పుస్తకాలు ఇప్పటికే ఈ గ్రంథాలయంలో వున్నట్టు
గ్రంథాలయాధికారిణి ఎన్.సుభాషిణి తెలిపారు. ఈరోజు ఇచ్చినవి తాజా ముద్రణలని
పేర్కొన్నారు.