విజయవాడ : తెలంగాణలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత మల్లు
భట్టివిక్రమార్కను రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో జరుగుతున్న
పాదయాత్రలో ఏపిసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారం
మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం గిడుగు రుద్రరాజు
మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించి గత 55 రోజులుగా జరుగుతున్న
పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన లభిస్తుందని, ఈ
పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం వస్తుందని, తెలంగాణ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా
ఉన్నారని పేర్కొన్నారు. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ముఖ్యంగా
యువత నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్
పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ యువనేత రాహుల్ గాంధీ,
ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈ విజయం చేకూరుతుందని గిడుగు రుద్రరాజు ఆశాభావం
వ్యక్తం చేశారు.